వందే భారత్‌ రైలుకు తప్పిన ముప్పు

లోకో పైలట్ల అప్రమత్తతతో వందే భారత్‌ రైలుకు పెను ప్రమాదం తప్పింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌ నుంచి జైపుర్‌కు సోమవారం ఉదయం 7.50 గంటలకు వందే భారత్‌ రైలు బయలుదేరింది.

Published : 03 Oct 2023 04:28 IST

ట్రాక్‌పై రాళ్లను గుర్తించి ఎక్స్‌ప్రెస్‌ను  ఆపేసిన లోకోపైలట్లు

జైపుర్‌: లోకో పైలట్ల అప్రమత్తతతో వందే భారత్‌ రైలుకు పెను ప్రమాదం తప్పింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌ నుంచి జైపుర్‌కు సోమవారం ఉదయం 7.50 గంటలకు వందే భారత్‌ రైలు బయలుదేరింది. ఉదయం 9.55 గంటల సమయంలో రైలు భిల్వాడా రైల్వే స్టేషన్‌ సమీపంలోకి రాగానే రైల్వే ట్రాక్‌పై రాళ్లు పేర్చి ఉండటాన్ని లోకో పైలట్లు గమనించారు. వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును నిలిపివేశారు. దీంతో వందల మంది ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. లోకో పైలట్లు కిందకు దిగి రైలు పట్టాలను పరీక్షించగా.. రాళ్లతోపాటు కొన్నిచోట్ల రాళ్లు కదలకుండా ఇనుపరాడ్లు పెట్టినట్లు గుర్తించారు. వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు