జీన్స్‌ వేసుకోవాలన్న అత్త.. చీరలే కడతానన్న కోడలు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో అత్తాకోడళ్ల మధ్య జరిగిన గొడవ స్థానికంగా చర్చనీయాంశమైంది. రోజూ జీన్స్‌ ధరించే అత్త.. కోడలు కూడా అవే దుస్తులు వేసుకోవాలని ఒత్తిడి తెస్తోంది. తనకు చీర కట్టుకోవడమే ఇష్టమని చెబుతున్నా..

Updated : 21 Nov 2023 08:39 IST
పోలీస్‌స్టేషన్‌కు చేరిన పంచాయితీ
 
త్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో అత్తాకోడళ్ల మధ్య జరిగిన గొడవ స్థానికంగా చర్చనీయాంశమైంది. రోజూ జీన్స్‌ ధరించే అత్త(mother-in-law).. కోడలు(daughter-in-law) కూడా అవే దుస్తులు వేసుకోవాలని ఒత్తిడి తెస్తోంది. తనకు చీర కట్టుకోవడమే ఇష్టమని చెబుతున్నా.. తన మాటను అత్త వినట్లేదని కోడలు వాపోతోంది. చేసేదేం లేక పోలీసులను ఆశ్రయించింది. హరిపర్వత్‌కి చెందిన ఓ యువకుడికి.. ఎత్మాద్‌పుర్‌ పరిధిలో ఉంటున్న యువతితో ఏడాది క్రితం వివాహమైంది. అయితే.. తనలాగానే రోజూ జీన్స్‌ వేసుకోవాలని కోడలిపై అత్త ఒత్తిడి చేస్తోంది. దీంతో కోడలు ఆగ్రా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ‘‘నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను. నాకు జీన్స్‌ వేసుకోవడం ఇష్టం లేదు. ఈ విషయం నా భర్తకు చెబితే తిరిగి నన్నే కొడుతున్నారు’’ అని కోడలు ఫిర్యాదు చేసింది. సయోధ్య కుదిర్చేందుకు కృషి చేస్తున్నట్లు ఏసీపీ సుకన్య శర్మ తెలిపారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని