వీకెండ్స్‌ కోసం ఎదురుచూడటంమానుకోండి : కంగనా రనౌత్‌

‘‘మనది ఇంకా అభివృద్ధి చెందిన దేశం కాదు. అధికంగా పనిచేసే సంస్కృతిని మనం సాధారణీకరించాలి. వారాంతాల కోసం ఎదురుచూడటం, ‘మండే మీమ్స్‌’ (సోమవారం నుంచి మొదలయ్యే పని గురించి పెట్టే పోస్టులు) మానుకోండి.

Published : 12 Jun 2024 06:13 IST

దిల్లీ: ‘‘మనది ఇంకా అభివృద్ధి చెందిన దేశం కాదు. అధికంగా పనిచేసే సంస్కృతిని మనం సాధారణీకరించాలి. వారాంతాల కోసం ఎదురుచూడటం, ‘మండే మీమ్స్‌’ (సోమవారం నుంచి మొదలయ్యే పని గురించి పెట్టే పోస్టులు) మానుకోండి. అదంతా పాశ్చాత్య సంస్కృతి. సోమరితనం, విసుగు వంటివి మనం దరి చేర్చకూడదు’’ అని ప్రముఖ సినీనటి, భాజపా ఎంపీ కంగనా రనౌత్‌ అన్నారు. ఈ మేరకు ఆమె తన అభిప్రాయాలను మంగళవారం ఇన్‌స్టాగ్రాం స్టోరీలో పంచుకున్నారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పీఎంవో సిబ్బందిని ఉద్దేశించి చేసిన ప్రసంగం తాలూకు వీడియో క్లిప్‌ను కూడా కంగనా పోస్టు చేశారు. అందులో మోదీ మాట్లాడుతూ..‘‘నా జీవితంలో ప్రతి క్షణం దేశం కోసమే. 2047 కల్లా భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు నేను అహరహం శ్రమిస్తాను’’ అని తెలిపారు. బాలీవుడ్‌లో అగ్రతారగా వెలుగొందుతున్న కంగనా రనౌత్‌ ఇటీవలి ఎన్నికల్లో తన సొంత రాష్ట్రమైన హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండీ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు