‘మోదీ కా పరివార్‌’ ట్యాగ్‌ తొలగించాలని ప్రధాని విజ్ఞప్తి

సామాజిక మాధ్యమాల్లోని ప్రొఫైల్‌ పేర్లలో జతచేసుకున్న ‘మోదీ కా పరివార్‌’ అనే ట్యాగ్‌లైన్‌ను తొలగించాలని ప్రధాని మోదీ తన అనుచరులకు సూచించారు.

Published : 12 Jun 2024 05:36 IST

దిల్లీ: సామాజిక మాధ్యమాల్లోని ప్రొఫైల్‌ పేర్లలో జతచేసుకున్న ‘మోదీ కా పరివార్‌’ అనే ట్యాగ్‌లైన్‌ను తొలగించాలని ప్రధాని మోదీ తన అనుచరులకు సూచించారు. అది కేవలం ఎన్నికల వరకు ఉద్దేశించింది మాత్రమేననీ.. తాజాగా ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఇక ఆ ట్యాగ్‌ను తీసేయాలని ఆయన మంగళవారం ‘ఎక్స్‌’ వేదికగా కోరారు. ఇటీవలి ఎన్నికలకు ముందు మోదీకి కుటుంబమంటూ లేదని బిహార్‌కు చెందిన ఆర్జేడీ అగ్రనేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ విమర్శించగా.. భారతీయులంతా తన కుటుంబ సభ్యులేనంటూ మోదీ ఆ వ్యాఖ్యలను తిప్పికొట్టడం తెలిసిందే. దాంతో మోదీకి మద్దతుగా భాజపా నేతలు, కార్యకర్తలంతా సోషల్‌ మీడియాలో తమ ప్రొఫైల్స్‌కు ‘మోదీ కా పరివార్‌’ అనే ట్యాగ్‌ను జతచేశారు. ఈ నేపథ్యంలో నాయకులు, శ్రేణులను ఉద్దేశించి మోదీ ‘ఎక్స్‌’ వేదికగా.. ‘‘ఎన్నికల సమయంలో మీరు చూపిన అభిమానం వెలకట్టలేనిది. సమష్టి కృషితో మూడోసారి ఎన్డీయే సర్కారు అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టించింది. ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ‘మోదీ కా పరివార్‌’ ట్యాగ్‌ను తొలగించండి. మన బంధం మాత్రం దృఢంగానే కొనసాగుతుంది’’ అని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని