ఉడుకుతున్న ఉత్తరాది రాష్ట్రాలు

ఉత్తర భారతంలో వేడి గాలుల(హీట్‌ వేవ్స్‌) ప్రభావం ఇంకా కొనసాగుతోంది. సగటున 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.

Published : 12 Jun 2024 06:10 IST

దిల్లీ: ఉత్తర భారతంలో వేడి గాలుల(హీట్‌ వేవ్స్‌) ప్రభావం ఇంకా కొనసాగుతోంది. సగటున 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మంగళవారం దిల్లీలోని నరేలాతోపాటు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అత్యధికంగా 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు దిల్లీలో ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. రాజస్థాన్‌లోని చురులో 45.6 డిగ్రీల వేడి ఉండగా.. సాయంత్రానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆగ్రాలోనూ కొద్దిసేపు వర్షం పడింది. జమ్మూలో 41.2 డిగ్రీలు నమోదు కాగా.. ఈ నెల 17 వరకు హీట్‌ వేవ్‌ ప్రభావం కొనసాగనున్నట్లు అధికారులు వెల్లడించారు. పంజాబ్, హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్‌ల్లోనూ ఎండల తీవ్రత అధికంగానే ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని