శరద్‌ పవార్‌కు అజిత్‌ కృతజ్ఞతలు

1999లో స్థాపించిన ఎన్సీపీ.. అతి తక్కువ కాలంలోనే ఎంతో ప్రజాదరణ పొందిందనీ, ఇన్నేళ్లుగా పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్న శరద్‌ పవార్‌కు అజిత్‌ పవార్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Published : 12 Jun 2024 06:11 IST

మోదీ క్యాబినెట్‌లో చోటు దక్కని వేళ.. వ్యాఖ్యలు చర్చనీయాంశం

ముంబయి: 1999లో స్థాపించిన ఎన్సీపీ.. అతి తక్కువ కాలంలోనే ఎంతో ప్రజాదరణ పొందిందనీ, ఇన్నేళ్లుగా పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్న శరద్‌ పవార్‌కు అజిత్‌ పవార్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్సీపీని స్థాపించి 24 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముంబయిలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇటీవలి ఎన్నికల్లో అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ.. అయిదు స్థానాల్లో పోటీచేసి కేవలం ఒక్క ఎంపీ సీటు మాత్రమే గెలుచుకుంది. ఆ ఫలితాలతో బాబాయి, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్‌ పవార్‌ విషయంలో తన వైఖరి మారినట్లు కనిపిస్తోంది. తాజా వ్యాఖ్యలే అందుకు నిదర్శనమని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎన్డీయేలో భాగస్వామి పక్షంగా ఉన్న అజిత్‌ సారథ్యంలోని ఎన్సీపీకి క్యాబినెట్‌లో చోటు దక్కని వేళ.. ఆయన కృతజ్ఞతలు చర్చనీయాంశమయ్యాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని