నెమ్మదించిన రుతుపవనాలు

నైరుతి రుతుపవనాల వేగం నెమ్మదించింది. బుధవారం నాటికి మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు చేరినప్పటికీ మధ్య, ఉత్తర భారత్‌లోని ప్రాంతాలకు విస్తరించడానికి మరికొంత సమయం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి.

Published : 13 Jun 2024 03:49 IST

దిల్లీ: నైరుతి రుతుపవనాల వేగం నెమ్మదించింది. బుధవారం నాటికి మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు చేరినప్పటికీ మధ్య, ఉత్తర భారత్‌లోని ప్రాంతాలకు విస్తరించడానికి మరికొంత సమయం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అందువల్ల పంజాబ్, హరియాణా, చండీగఢ్, దిల్లీ, యూపీ, ఝార్ఖండ్, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం వేడి గాలుల తీవ్రత కొనసాగింది. బంగాళాఖాతం మీదుగా వచ్చే రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయని, అవి చురుగ్గా కదలటానికి మరికొంత సమయం పట్టవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, బంగాళాఖాతం వాయవ్య ప్రాంతాలకు రుతుపవనాలు మూడు నుంచి నాలుగు రోజుల్లో చేరుకోవచ్చని అంచనా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని