జమ్మూకశ్మీర్‌లో శాంతిపై డొల్ల ప్రకటనలు : కాంగ్రెస్‌

జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతలు నెలకొంటున్నాయని, సాధారణ పరిస్థితులే ఉంటున్నాయని భాజపా రొమ్ము విరుచుకొని డొల్ల ప్రకటనలు చేస్తోందని కాంగ్రెస్‌ పార్టీ బుధవారం విమర్శించింది.

Published : 13 Jun 2024 05:45 IST

దిల్లీ: జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతలు నెలకొంటున్నాయని, సాధారణ పరిస్థితులే ఉంటున్నాయని భాజపా రొమ్ము విరుచుకొని డొల్ల ప్రకటనలు చేస్తోందని కాంగ్రెస్‌ పార్టీ బుధవారం విమర్శించింది. వారు చేస్తున్నదంతా తప్పుడు ప్రచారమే అని గత మూడు రోజుల్లో జరిగిన మూడు ఉగ్ర దాడులు చెబుతున్నాయని తెలిపింది. భారత్‌పై జరుగుతున్న కుట్రలను భాజపా పాలనలో ఎందుకు పసిగట్టలేకపోతున్నారో చెప్పాలని దేశం సమాధానాలు కోరుతోందని కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీ డిమాండ్‌ చేశారు. అభినందన సందేశాలకు బదులిచ్చే పనిలో బిజీగా ఉన్న నరేంద్ర మోదీ జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడి బాధితుల రోదనలు కూడా వినలేకపోతున్నారని ‘ఎక్స్‌’ వేదికగా ఆయన విమర్శించారు. స్వయం ప్రకటిత దైవదూత లాంటి మోదీ నుంచి బాధితులు కనీసం సానుభూతికి కూడా నోచుకోలేరా అని కాంగ్రెస్‌ మీడియా ఇన్‌ఛార్జి పవన్‌ ఖేడా ప్రశ్నించారు.  

రియాసీ బస్సు దాడి ఘటనలో ఉగ్రవాది ఊహాచిత్రం విడుదల

జమ్మూకశ్మీర్‌లో రియాసీ వద్ద జూన్‌ 9న యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 9 మంది మరణించగా.. మరో 41 మంది భక్తులు గాయపడిన విషయం తెలిసిందే. ఈ దాడికి పాల్పడినవారిలో కీలక నిందితుడి ఊహాచిత్రాన్ని పోలీసులు విడుదల చేశారు. ఉగ్రవాదుల గురించి సమాచారం అందించినవారికి రూ.20 లక్షల రివార్డును ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని