కేంద్రం సహాయం చేయాలి

కువైట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో పలువురు తమ రాష్ట్ర వాసులు మృతి చెందారని, ఈ విషయంలో కేంద్రం సహాయం అందించాలని కోరుతూ విదేశాంగశాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌కు కేరళ ముఖ్యమంత్రి విజయన్‌ బుధవారం సాయంత్రం లేఖ రాశారు.

Updated : 13 Jun 2024 05:52 IST

కువైట్‌ అగ్ని ప్రమాదంపై కేరళ సీఎం విజయన్‌ లేఖ

తిరువనంతపురం: కువైట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో పలువురు తమ రాష్ట్ర వాసులు మృతి చెందారని, ఈ విషయంలో కేంద్రం సహాయం అందించాలని కోరుతూ విదేశాంగశాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌కు కేరళ ముఖ్యమంత్రి విజయన్‌ బుధవారం సాయంత్రం లేఖ రాశారు. ఈ ఘటన అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ‘కువైట్‌లోని భారత రాయబార కార్యాలయానికి అవసరమైన ఆదేశాలివ్వండి. కువైట్‌ ప్రభుత్వంతో కలిసి సహాయక చర్యలను పర్యవేక్షించండి’ అని విజయన్‌ లేఖలో కోరారు.  

తమిళనాడు ప్రభుత్వ హెల్ప్‌లైన్‌ 

కువైట్‌ అగ్ని ప్రమాద మృతుల్లో తమిళనాడు వాసులు ఉన్నారన్న వార్తల నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్‌లైన్‌ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. భారత్‌లోని వారు +91 1800 309 3793కి, విదేశాల్లోని వారు +91 80 6900 9900, +91 80 6900 9901 నంబర్లకు కాల్‌ చేయాలని సూచించింది. ఘటనలో చనిపోయినవారుగానీ, గాయపడినవారుగానీ తమిళనాడుకు చెంది ఉంటే వెంటనే సహాయక చర్యలను చేపట్టాలని పునరావాస, సంక్షేమ కమిషనరును ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆదేశించారు. 

అవసరమైన సాయం అందించండి: కాంగ్రెస్‌

దిల్లీ: కువైట్‌ అగ్ని ప్రమాదంలో పలువురు భారతీయులు మరణించడంపట్ల కాంగ్రెస్‌ సంతాపం తెలిపింది. బాధితులకు అవసరమైన అన్ని సహాయక చర్యలు చేపట్టాలని విదేశాంగశాఖకు విజ్ఞప్తి చేసింది. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎక్స్‌లో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలను ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని