అంగారకుడిపై అగ్నిబిలానికి భారత శాస్త్రవేత్త దేవేంద్రలాల్‌ పేరు

అంగారక గ్రహంపై ఇటీవల కనుగొన్న మూడు అగ్నిబిలాల్లో ఒకదానికి దివంగత, ప్రఖ్యాత కాస్మిక్‌ కిరణ భౌతిక శాస్త్రవేత్త దేవేంద్ర లాల్‌ పేరు పెట్టారు.

Published : 13 Jun 2024 05:53 IST

అహ్మదాబాద్‌: అంగారక గ్రహంపై ఇటీవల కనుగొన్న మూడు అగ్నిబిలాల్లో ఒకదానికి దివంగత, ప్రఖ్యాత కాస్మిక్‌ కిరణ భౌతిక శాస్త్రవేత్త దేవేంద్ర లాల్‌ పేరు పెట్టారు. మిగిలిన రెండు బిలాలకు ఉత్తర్‌ ప్రదేశ్‌లోని    ముర్సాన్‌ పట్టణం, బిహార్‌లోని హిల్సా టౌన్‌ పేర్లను పెట్టారు. ఆ ప్రకారం వాటిని ఇకపై లాల్‌ క్రేటర్, ముర్సాన్‌ క్రేటర్, హిల్సా క్రేటర్‌గా వ్యవహరిస్తారు. అహ్మదాబాద్‌లోని ఫిజికల్‌ రిసెర్చ్‌ ల్యాబొరేటరీకి చెందిన పరిశోధకులు, శాస్త్రవేత్తలతో కూడిన బృందం 2021లో మార్స్‌పై అగ్నిబిలాలను గుర్తించారు. వాటికి పెట్టిన పేర్లకు  అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య (ఐఏయూ) ఈ నెల 5న ఆమోదం తెలిపింది. ఈ మేరకు భారత అంతరిక్ష విభాగం బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని