దిల్లీలోని మ్యూజియంలు, ఆరోగ్య సంస్థలకు బాంబు బెదిరింపులు

దేశ రాజధాని దిల్లీలోని నేషనల్‌ మ్యూజియం, రైల్‌ మ్యూజియం సహా అనేక ప్రదర్శనశాలలకు, రెండు మానసిక ఆరోగ్య సంస్థలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.

Published : 13 Jun 2024 05:54 IST

చండీగఢ్‌లోని మానసిక ఆరోగ్య సంస్థకు కూడా..
ఉత్తుత్తివేనని తేల్చిన పోలీసులు

దిల్లీ, చండీగఢ్‌: దేశ రాజధాని దిల్లీలోని నేషనల్‌ మ్యూజియం, రైల్‌ మ్యూజియం సహా అనేక ప్రదర్శనశాలలకు, రెండు మానసిక ఆరోగ్య సంస్థలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. చండీగఢ్‌లోని మానసిక ఆరోగ్య కేంద్రానికి కూడా బెదిరింపు ఈమెయిళ్లు వచ్చాయి. మ్యూజియంలతోపాటు దిల్లీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ బిహేవియర్‌ అండ్‌ అలైడ్‌ సైన్సెస్‌ (ఐహెచ్‌బీఏఎస్‌), విద్యాసాగర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్, న్యూరో అండ్‌ అలైడ్‌ సైన్సెస్‌ (విఐఎంహెచ్‌ఏఎన్‌ఎస్‌)లకు బెదిరింపు ఈమెయిళ్లు వచ్చినట్లు ఓ అధికారి బుధవారం తెలిపారు. దీంతో ఆయా సంస్థల్లో బాంబు గుర్తింపు, బాంబు నిర్వీర్యక బృందాలు, అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు క్షణ్నంగా సోదాలు నిర్వహించారని, ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని వెల్లడించారు. దీంతో ఈ ఈమెయిళ్లను ఉత్తుత్తి బెదిరింపులుగా పోలీసులు ప్రకటించారని చెప్పారు. చండీగఢ్‌లోని మానసిక ఆరోగ్య కేంద్రానికి కూడా బాంబు బెదిరింపు రాగా, అదికూడా ఉత్తుత్తిదేనని తనిఖీల అనంతరం అధికారులు ప్రకటించారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు