ఇంటి ముందు కాల్పుల ఘటనలో సల్మాన్‌ వాంగ్మూలం నమోదు

దేశ వాణిజ్య రాజధాని ముంబయిలోని తన ఇంటి వద్ద దుండగులు కాల్పులు జరిపిన ఘటనకు సంబంధించి బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ వాంగ్మూలాన్ని పోలీసులు బుధవారం నమోదు చేశారు.

Published : 13 Jun 2024 05:55 IST

ముంబయి: దేశ వాణిజ్య రాజధాని ముంబయిలోని తన ఇంటి వద్ద దుండగులు కాల్పులు జరిపిన ఘటనకు సంబంధించి బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ వాంగ్మూలాన్ని పోలీసులు బుధవారం నమోదు చేశారు. ఈ మేరకు క్రైమ్‌ బ్రాంచ్‌కు చెందిన నలుగురు సభ్యుల బృందం ఈనెల 4న బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్‌ను సందర్శించినట్లు ఓ అధికారి తెలిపారు. సల్మాన్‌ సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌ స్టేట్‌మెంట్‌ను కూడా అధికారులు రికార్డు చేశారని వెల్లడించారు. బాలీవుడ్‌ నటుడి స్టేట్‌మెంట్‌ రికార్డు చేయడానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టగా, ఆయన సోదరుడి స్టేట్‌మెంట్‌కు 2 గంటలకుపైగా పట్టినట్లు తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 14వ తేదీన రెండు మోటారుసైకిళ్లపై వచ్చిన దుండగులు సల్మాన్‌ ఇంటివద్ద అనేక రౌండ్ల కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని