అవినీతిపై 4 నెలలుగా నిరాహార దీక్ష.. మథురలో సామాజిక కార్యకర్త మృతి

గ్రామీణాభివృద్ధి పనుల్లో అవినీతి జరుగుతోందని ఆరోపిస్తూ దానికి నిరసనగా నాలుగు నెలలుగా నిరాహార దీక్ష చేస్తున్న ఓ సామాజిక కార్యకర్త మృతిచెందారు.

Published : 14 Jun 2024 04:26 IST

మథుర: గ్రామీణాభివృద్ధి పనుల్లో అవినీతి జరుగుతోందని ఆరోపిస్తూ దానికి నిరసనగా నాలుగు నెలలుగా నిరాహార దీక్ష చేస్తున్న ఓ సామాజిక కార్యకర్త మృతిచెందారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర జిల్లాలో గురువారం జరిగింది. ఉపాధి హామీ పథకం, మరుగుదొడ్ల నిర్మాణ పనుల్లో అవినీతి జరుగుతోందని ఆరోపిస్తూ మహాదేవకినంద శర్మ(66) ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టాలని ఆదేశిస్తూ వారు ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. అందులో శర్మ కూడా సభ్యుడిగా ఉన్నారు. ఈ బృందం ఇచ్చిన నివేదికతో సంతృప్తి చెందని శర్మ.. తన నివాసానికి సమీపంలో ఉన్న ఓ ఆలయం ముందు ఫిబ్రవరి 12న నిరాహార దీక్ష చేపట్టారు. నాలుగు నెలలుగా దానిని కొనసాగిస్తుండడంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. అధికారులు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శర్మ ప్రాణాలు విడిచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు