26న లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక

లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక ఈ నెల 26వ తేదీన జరగనుంది. 25వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకూ ఇందుకోసం నామినేషన్లను స్వీకరించనున్నట్లు లోక్‌సభ సచివాలయం గురువారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.

Published : 14 Jun 2024 04:29 IST

దిల్లీ: లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక ఈ నెల 26వ తేదీన జరగనుంది. 25వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకూ ఇందుకోసం నామినేషన్లను స్వీకరించనున్నట్లు లోక్‌సభ సచివాలయం గురువారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. పోటీలో ఒకరి కంటే ఎక్కువ మంది ఉంటే ఓటింగ్‌ జరుగుతుంది. లేదంటే ఏకగ్రీవంగా స్పీకర్‌ ఎన్నికవుతారు. లోక్‌సభ సమావేశాలు ఈ నెల 24 నుంచి జులై 3వ తేదీ వరకూ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని