10, 12 తరగతుల బోర్డు పరీక్షల కేంద్రాల్లో బాలికలకు రుతు రుమాళ్లు

చదువుకునే బాలికల ఆరోగ్య పరిరక్షణకు సంబంధించి కేంద్ర విద్యాశాఖ కీలక సూచనలు చేసింది. పది, పన్నెండో తరగతుల బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థినులకు రుతుస్రావం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను నివారించడానికి చర్యలు తీసుకోవాలని విద్యాసంస్థలను ఆదేశించింది.

Published : 14 Jun 2024 04:29 IST

విద్యాసంస్థలకు కేంద్ర విద్యాశాఖ సూచన

దిల్లీ: చదువుకునే బాలికల ఆరోగ్య పరిరక్షణకు సంబంధించి కేంద్ర విద్యాశాఖ కీలక సూచనలు చేసింది. పది, పన్నెండో తరగతుల బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థినులకు రుతుస్రావం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను నివారించడానికి చర్యలు తీసుకోవాలని విద్యాసంస్థలను ఆదేశించింది. పరీక్ష మధ్యలో వారిని రెస్ట్‌రూమ్‌లకు అనుమతించాలని, రుతు రుమాళ్లు (శానిటరీ నాప్కిన్స్‌) ఉచితంగా అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. దీనివల్ల నెలసరి రోజుల్లోనూ వారు పరీక్షలపై మనసు నిమగ్నం చేయగలరని, ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా పరీక్షలు రాయగలరని తెలిపింది. ఆరోగ్యకరమైన విధానాలు అనుసరించేలా బాలికలను ప్రోత్సహించినట్లు అవుతుందని పేర్కొంది. సీబీఎస్‌ఈ, కేవీఎస్, నవోదయ విద్యాలయ సమితి, రాష్ట్రాల పరిధిలోని పాఠశాలలు, విద్యాసంస్థలకు కేంద్ర విద్యాశాఖ ఈ సూచనలను పంపించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు