సిక్కింలో విరిగిపడిన కొండచరియలు

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సిక్కింలోని మంగన్‌ జిల్లాలో భారీ కొండచరియలు విరిగిపడి ఆరుగురు మృతిచెందారు.

Published : 14 Jun 2024 05:05 IST

ఆరుగురి మృతి
చిక్కుకుపోయిన 1500 మంది

గ్యాంగ్‌టక్‌: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సిక్కింలోని మంగన్‌ జిల్లాలో భారీ కొండచరియలు విరిగిపడి ఆరుగురు మృతిచెందారు. రహదారులపై పడిన మట్టిపెళ్లలతో 1500 మంది పర్యాటకులు చిక్కుకుపోయారని అధికారులు గురువారం తెలిపారు. వరదల కారణంగా చాలా రోడ్లు జలమయమయ్యాయి. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. వరదల్లో విద్యుత్‌ స్తంభాలు కొట్టుకుపోయాయి. సాంగ్‌కలాంగ్‌ వద్ద నూతనంగా నిర్మించిన ఓ తాత్కాలిక వంతెన కూలిపోవడంతో మంగన్‌తో డిజొంగు, చుంగ్‌తాంగ్‌ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బాధితులను ఆదుకోవాలంటూ సిక్కిం సీఎం ప్రేమ్‌సింగ్‌ తమాంగ్‌ ఉత్తర జిల్లాల అధికారులను ఆదేశించారు.  బాధితులకు, వారి కుటుంబాలకు ప్రాథమిక అవసరాలు తీర్చడంతో పాటు అన్ని విధాల సాయం అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు