పాపువా న్యూగినీకి భారత్‌ చేయూత

ఇటీవల పాపువా న్యూగినీలో భారీ కొండచరియలు విరిగిపడిన ఎంగా ప్రావిన్సుకు మనదేశం గురువారం 19 టన్నుల మానవతా, విపత్తు సహాయ(హెచ్‌ఏడీఆర్‌) సామగ్రిని పంపింది.

Published : 14 Jun 2024 05:05 IST

19 టన్నుల సహాయ సామగ్రి అందజేత

దిల్లీ: ఇటీవల పాపువా న్యూగినీలో భారీ కొండచరియలు విరిగిపడిన ఎంగా ప్రావిన్సుకు మనదేశం గురువారం 19 టన్నుల మానవతా, విపత్తు సహాయ(హెచ్‌ఏడీఆర్‌) సామగ్రిని పంపింది. గతనెలలో కొండచరియలు విరిగిపడి పాపువా న్యూగినీలో 2,000 మందికి పైగా సజీవ సమాధి అయిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన భారత్‌ ఆ దేశానికి మిలియన్‌ డాలర్ల సహకారాన్ని ప్రకటించింది. దీనిలో భాగంగా గురువారం 19 టన్నుల సహాయ సామగ్రిని విమానంలో పంపినట్లు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని