ఎన్నికల ఫలితాలపై బెట్టింగులు.. వెబ్‌సైట్‌పై ఈడీ సోదాలు

లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు, ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లను అక్రమంగా ప్రసారం చేస్తున్న ఓ వెబ్‌సైట్‌ కార్యాలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించారు.

Published : 14 Jun 2024 05:09 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు, ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లను అక్రమంగా ప్రసారం చేస్తున్న ఓ వెబ్‌సైట్‌ కార్యాలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించారు. ముంబయి, పుణెలో మనీలాండరింగ్‌ విచారణలో భాగంగా బుధవారం 19 ప్రాంతాల్లో ఈ సోదాలు చేపట్టినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. నగదు, బ్యాంకు నిధులు, డీమాట్‌ ఖాతాదారుల హోల్డింగులతో పాటు రూ.8కోట్ల విలువైన చేతి గడియారాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఫెయిర్‌ ప్లే స్పోర్ట్‌ ఎల్‌ఎల్‌సీ పాటు ఇతర వెబ్‌సైట్‌ల కారణంగా రూ.100 కోట్ల ఆదాయాన్ని కోల్పోయామంటూ వయాకమ్‌18 మీడియా సంస్థ ముంబయి సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మనీలాండరింగ్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని