బెంగాల్‌ రాజ్‌భవన్‌లోకి వెళ్లకుండా.. సువేందు అధికారిని అడ్డుకొన్న పోలీసులు

లోక్‌సభ ఎన్నికల అనంతరం జరిగిన హింస బాధితులతో కలిసి గురువారం పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌ సి.వి.ఆనందబోస్‌ను కలిసేందుకు వెళుతున్న రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష (భాజపా) నేత సువేందు అధికారిని కోల్‌కతా పోలీసులు అడ్డుకున్నారు.

Published : 14 Jun 2024 05:09 IST

కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల అనంతరం జరిగిన హింస బాధితులతో కలిసి గురువారం పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌ సి.వి.ఆనందబోస్‌ను కలిసేందుకు వెళుతున్న రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష (భాజపా) నేత సువేందు అధికారిని కోల్‌కతా పోలీసులు అడ్డుకున్నారు. రాజ్‌భవన్‌ బయట 144 సెక్షను అమలులో ఉన్నందున గుంపుగా రావడాన్ని అనుమతించబోమని చెప్పారు. గవర్నర్‌ను కలిసి బాధితులకు న్యాయం చేయాలని కోరేందుకు తాను అపాయింట్‌మెంటు తీసుకున్నానని, తమ వాహనాలను అడ్డుకున్న కోల్‌కతా పోలీసుల ఏకపక్ష నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయిస్తానంటూ సువేందు అధికారి మీడియాకు వెల్లడించారు. ‘‘గంటసేపు వేచిచూసినా పోలీసులు మమ్మల్ని లోపలికి పంపలేదు. 200 మంది బాధితులతో తనను కలిసేందుకు అపాయింట్‌మెంటు ఇచ్చిన గవర్నర్‌ నిర్ణయాన్ని కూడా వారు పట్టించుకోలేదు. ఈ విషయం గవర్నర్‌ కార్యాలయానికి తెలియజేశా. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరుతామని చెప్పారు’’ అని ఆయన వివరించారు. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ కార్యకర్తలపై దౌర్జన్యాలు చేసిన భాజపా తిరిగి తమపైనే ఫిర్యాదులు చేస్తోందని తృణమూల్‌ నేత కునాల్‌ ఘోష్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని