‘మోదీ’ తాడాసనం!

అంతర్జాతీయ యోగా దినోత్సవం సమీపిస్తున్న సందర్భంగా ప్రధాని మోదీ ‘తాడాసనం’పై ఓ వీడియోను విడుదల చేశారు.

Published : 14 Jun 2024 05:49 IST

అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో వీడియో విడుదల

దిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవం సమీపిస్తున్న సందర్భంగా ప్రధాని మోదీ ‘తాడాసనం’పై ఓ వీడియోను విడుదల చేశారు. మోదీని పోలిన గ్రాఫిక్‌ ఇమేజ్‌ ఆ ఆసనం ఎలా వేయాలో చూపిస్తోంది. దానివల్ల కలిగే ప్రయోజనాలను చిత్రాల రూపంలో అందులో చూడొచ్చు. ‘ఇది శరీరానికి ఎంతో మంచిది. శరీర భాగాల స్థితిని ఒక క్రమంలో ఉంచడంలో ఉపకరిస్తుంది’ అని ప్రధాని గురువారం ఎక్స్‌లో విడుదల చేసిన ఆ వీడియోలో పేర్కొన్నారు. పదేళ్ల క్రితం జూన్‌ 21ని యోగా దినోత్సవంగా నిర్వహించాలని ఐరాసలో భారత్‌ ప్రతిపాదించింది. దానికి అన్ని దేశాలు ముక్తకంఠంతో ఆమోదం తెలిపాయి. దీంతో ఏటా జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని