నీట్‌ పరీక్షలో అక్రమాలు.. గుజరాత్‌లో ఐదుగురి అరెస్టు

నీట్‌-యూజీ పరీక్షలో అక్రమాలకు పాల్పడేందుకు ప్రయత్నించిన ఐదుగురు వ్యక్తులను శుక్రవారం గుజరాత్‌లోని పంచ్‌ మహల్‌ జిల్లాలోని గోధ్రా పోలీసులు అరెస్టు చేశారు. 

Published : 15 Jun 2024 05:34 IST

గోధ్రా: నీట్‌-యూజీ పరీక్షలో అక్రమాలకు పాల్పడేందుకు ప్రయత్నించిన ఐదుగురు వ్యక్తులను శుక్రవారం గుజరాత్‌లోని పంచ్‌ మహల్‌ జిల్లాలోని గోధ్రా పోలీసులు అరెస్టు చేశారు. ఓ పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుడు కూడా ఉన్నారు. ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం.. ఇందులో నిందితుడు పరశురామ్‌ రాయ్‌ పరీక్షలో సాయం చేస్తామని చెప్పి 27 మంది విద్యార్థుల నుంచి రూ.10 లక్షలు తీసుకున్నారు. ఆయన కార్యాలయంపై సోదాలు నిర్వహించినపుడు రూ.2.30 కోట్ల విలువైన చెక్కులు లభించాయి. ఈ సమాచారం జిల్లా కలెక్టర్‌కు తెలియడంతో, అధికారులు ముందుగానే నీట్‌ పరీక్షా కేంద్రానికి చేరుకుని నిందితుల ప్రణాళిక అమలు జరగకుండా అడ్డుకున్నారు. తెలిసిన ప్రశ్నలకు జవాబులు రాసి.. కఠినమైన ప్రశ్నలు ఖాళీగా వదిలేయాలని 27 మంది విద్యార్థులకు నిందితులు సూచించారు. విద్యార్థుల నుంచి పేపర్లు తీసుకున్న తర్వాత సెంటర్‌ సూపర్‌వైజర్లకు 30 నిమిషాలు సమయం ఇస్తారు. ఆ సమయంలో ఖాళీగా ఉంచిన ప్రశ్నలకు సరైన సమాధానాలను టిక్‌ చేయాలని ప్రణాళిక వేసుకున్నారు. అయితే అధికారులు ముందుగానే చేరుకొని వారి ప్రణాళికను భగ్నం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని