పత్రికాస్వేచ్ఛను అడ్డుకొనే చట్టాలు ఉపసంహరించుకోండి

పత్రికాస్వేచ్ఛను అడ్డుకోవడమే లక్ష్యంగా ఉన్న చట్టాలను ఉపసంహరించుకోవాలని పలు జర్నలిస్టు సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి.

Published : 15 Jun 2024 05:34 IST

దిల్లీ: పత్రికాస్వేచ్ఛను అడ్డుకోవడమే లక్ష్యంగా ఉన్న చట్టాలను ఉపసంహరించుకోవాలని పలు జర్నలిస్టు సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. అలాగే ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా స్థానంలో ప్రసార, డిజిటల్‌ మీడియాలతో కూడిన బాడీని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు 15 జర్నలిస్టు సంఘాల ప్రతినిధులతో దిల్లీలో ఏర్పాటుచేసిన సమావేశం ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేసింది. మరీ ముఖ్యంగా.. తప్పుదోవ పట్టించేలా ఉందని భావించిన ఏ సమాచారమైనా ఆన్‌లైన్‌ కంటెంటు నుంచి తొలగించే అధికారం ప్రభుత్వానికి కల్పిస్తూ ఐటీ చట్టంలో గతేడాది చేసిన సవరణలు పత్రికల నోళ్లు మూయించే ప్రయత్నమేనంటూ ఈ సమావేశం తప్పుబట్టింది. ప్రెస్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా, ది ప్రెస్‌ అసోసియేషన్‌ తదితర సంఘాలు ఇందులో పాల్గొన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు