శివునికి ఎవరి రక్షణా అవసరం లేదు

యమునా నది వరదకు గురయ్యే తీర భూమిలో గల ప్రాచీన శివాలయాన్ని కూల్చివేయాలంటూ దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు శుక్రవారం సమర్థించింది.

Published : 15 Jun 2024 06:19 IST

ఆలయం కూల్చివేత ఆదేశాలకు సుప్రీం సమర్థన 

దిల్లీ: యమునా నది వరదకు గురయ్యే తీర భూమిలో గల ప్రాచీన శివాలయాన్ని కూల్చివేయాలంటూ దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు శుక్రవారం సమర్థించింది. ఆలయ కూల్చివేతపై పిటిషన్‌ దారులలో శివుడిని చేర్చడానికి మే 29న హైకోర్టు నిరాకరించింది. మహా శివునికి ఎవరి రక్షణా అవసరం లేదంది. యమునా నదీ తీరంలో, నదీ గర్భంలో అక్రమ ఆక్రమణలను తొలగిస్తే ఆయన ఎక్కువ సంతోషిస్తారని పేర్కొంది. ప్రాచీన శివ మందిర్‌ను నిర్మించిన స్థలం విశాల ప్రజా ప్రయోజనాలకు ఉద్దేశించినదని వ్యాఖ్యానించింది. ఆలయ స్థలం తమదేనని నిరూపించే దస్తావేజులను కానీ, ఇతర సాక్ష్యాధారాలను కానీ ఆలయ కమిటీ సమర్పించలేకపోయిందని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని