తేనెటీగల దాడి.. పీపీఈ కిట్లుధరించి దహన సంస్కారాలు

తేనెటీగలు దాడి చేయడంతో పీపీఈ కిట్లు ధరించి దహన సంస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన పరిస్థితి ఎదురైంది. మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

Published : 15 Jun 2024 05:58 IST

సింధుదుర్గ్‌: తేనెటీగలు దాడి చేయడంతో పీపీఈ కిట్లు ధరించి దహన సంస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన పరిస్థితి ఎదురైంది. మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. గుండెపోటుతో మృతిచెందిన 70ఏళ్ల రైతుకు అంత్య క్రియలు చేసేందుకు తితవలి గ్రామంలో కుటుంబ సభ్యులు, స్థానికులు గురువారం గుమిగూడారు. కలపను కాల్చడంతో వచ్చిన పొగ కారణంగా తేనెటీగల గుంపు వారిపై దాడి చేసింది. ఈ క్రమంలోనే వారు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ఐదు పీపీఈ కిట్లను తెచ్చారు. కుటుంబ సభ్యులు ఆ కిట్లను ధరించి అంత్యక్రియలు పూర్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని