ఆర్మీ అమ్ములపొదిలో ‘నాగాస్త్ర-1’

భారత సైన్యం అమ్ముల పొదిలోకి సరికొత్త అస్త్రం చేరింది. మహారాష్ట్ర నాగ్‌పుర్‌లోని సోలార్‌ ఇండస్ట్రీస్‌ అభివృద్ధి చేసిన ‘నాగాస్త్ర-1’ సైన్యం చేతికి వచ్చింది.

Updated : 15 Jun 2024 12:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత సైన్యం అమ్ముల పొదిలోకి సరికొత్త అస్త్రం చేరింది. మహారాష్ట్ర నాగ్‌పుర్‌లోని సోలార్‌ ఇండస్ట్రీస్‌ అభివృద్ధి చేసిన ‘నాగాస్త్ర-1’ సైన్యం చేతికి వచ్చింది. వైమానిక దాడుల నిమిత్తం వినియోగించే 480 నాగాస్త్రాలను సైన్యం ఆర్డర్‌ ఇవ్వగా.. వాటిలో తొలి విడతగా 120 అందాయి. జీపీఎస్‌ ఆధారంగా పని చేసే ‘నాగాస్త్ర-1’ రెండు మీటర్ల కచ్చితత్వంతో దాడి చేయగలదు. దీనిని ఆత్మాహుతి (సూసైడ్‌) డ్రోన్‌ అని కూడా పిలుస్తుంటారు. తొమ్మిది కిలోల బరువుండే ఈ డ్రోన్‌ సుమారు 4500 మీటర్ల ఎత్తు వరకు ఎగరగలదు. రాడార్లకు దొరక్కుండా దాడులు చేయగలదు. దాదాపు గంటసేపు ఇది గాల్లో ఎగరగలదు. రాత్రి వేళల్లోనూ ఇది కచ్చితత్వంతో పనిచేయగలదు. అభివృద్ధి చెందిన దేశాల వద్ద ఉన్న డ్రోన్ల కంటే ఇది మరింత మెరుగైంది. లక్ష్యాన్ని గుర్తించలేకపోయినా లేదా మిషన్‌ను మధ్యలో రద్దు చేసినా తిరిగి వెనక్కి రప్పించవచ్చు. సాఫ్ట్‌ ల్యాండింగ్‌ కోసం దీనికి పారాషూట్‌ సదుపాయం కూడా ఉంటుంది. అధునాతన ఫీచర్లతో దేశీయంగానే దీన్ని రూపొందించడం గమనార్హం. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని