షీనాబోరా అస్థికలు మాయం

ఇరవై నాలుగేళ్ల షీనా బోరా హత్య కేసులో మరో ట్విస్టు చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక సాక్ష్యంగా ఉన్న మృతురాలి అస్థికలు మాయమైనట్లు దర్యాప్తు అధికారులు సీబీఐ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

Published : 15 Jun 2024 05:59 IST

ముంబయి: ఇరవై నాలుగేళ్ల షీనా బోరా హత్య కేసులో మరో ట్విస్టు చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక సాక్ష్యంగా ఉన్న మృతురాలి అస్థికలు మాయమైనట్లు దర్యాప్తు అధికారులు సీబీఐ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 2012లో ఇంద్రాణీ ముఖర్జీనే కూతురు షీనా బోరాను హత్య చేసిన విషయం తెలిసిందే. ఇది 2015లో బయటకు వచ్చింది. ఈ కేసులో గురువారం ఫోరెన్సిక్‌ వైద్యుల వాగ్మూలం నమోదు చేసే క్రమంలో గతంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న అస్థికలు కనిపించడం లేదని కోర్టుకు వెల్లడించారు. వాదోపవాదనల అనంతరం కోర్టు కేసును ఈ నెల 27కు వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని