బుల్లెట్‌ రైలులో ఆటోమేటెడ్‌ వర్షపాత పర్యవేక్షణ వ్యవస్థ

బుల్లెట్‌ రైలు సేవలను సురక్షితంగా నిర్వహించేందుకు ఆటోమేటెడ్‌ వర్షపాత పర్యవేక్షణ వ్యవస్థ(రెయిన్‌ఫాల్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌)ను అవలంబిస్తున్నామని శుక్రవారం రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ‘ఎక్స్‌’ వేదికగా తెలిపారు.

Published : 15 Jun 2024 06:19 IST

 రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

దిల్లీ: బుల్లెట్‌ రైలు సేవలను సురక్షితంగా నిర్వహించేందుకు ఆటోమేటెడ్‌ వర్షపాత పర్యవేక్షణ వ్యవస్థ(రెయిన్‌ఫాల్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌)ను అవలంబిస్తున్నామని శుక్రవారం రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ‘ఎక్స్‌’ వేదికగా తెలిపారు. అధునాతన ఇన్‌స్ట్రుమెంటేషన్‌ సిస్టమ్‌తో కూడిన ఈ వ్యవస్థ వర్షమాప సూచీలను ఉపయోగించి వర్షపాతంపై కచ్చితత్వంతో సమాచారాన్ని  అందిస్తుంది’ అని రైల్వే మంత్రి వివరించారు. బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు కారిడార్‌ను నిర్మిస్తున్న నేషనల్‌ హై స్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌) ప్రకారం.. ట్రాక్‌ దగ్గర ఏర్పాటు చేసిన రెయిన్‌గేజ్‌ ద్వారా ఉత్పన్నమయ్యే డేటాను ట్రాక్‌ మెయింటెనెన్స్‌ సెంటర్‌ పర్యవేక్షిస్తుంది. రైలు వేగ పరిమితులు లేదా సడలింపు కోసం అవసరమైన విధానాల అమలుకు సలహా ఇవ్వడానికి ఈ డేటా రైలు ట్రాఫిక్‌ కంట్రోలర్‌తో భాగస్వామ్యమవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని