చాంద్‌నీ చౌక్‌లో భారీ అగ్నిప్రమాదం

ఉత్తర దిల్లీలోని చాంద్‌నీ చౌక్‌ ప్రాంతంలో గురువారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 50కిపైగా దుకాణాలు దగ్ధమయ్యాయి.

Published : 15 Jun 2024 06:02 IST

50కి పైగా దుకాణాలు దగ్ధం

దిల్లీ: ఉత్తర దిల్లీలోని చాంద్‌నీ చౌక్‌ ప్రాంతంలో గురువారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 50కిపైగా దుకాణాలు దగ్ధమయ్యాయి. 50 అగ్నిమాపక వాహనాలు, 200 మంది సిబ్బంది 12 గంటల పాటు శ్రమించి శుక్రవారం తెల్లవారుజామున 4:30 గంటలకు మంటలను అదుపులోకి తెచ్చారని పోలీసులు తెలిపారు. 

ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని పేర్కొన్నారు. దగ్ధమైన దుకాణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని, ఆస్తి నష్టం రూ.కోట్లలో జరిగి ఉండొచ్చని అంచనా వేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని