బహుముఖాలను గుర్తించే ఏఐ టూల్‌

ఒకేసారి అత్యంత కచ్చితత్వంతో బహుముఖాలను గుర్తించగలిగేలా ఓ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) టూల్‌ని ఒక స్టార్టప్‌ సంస్థ అభివృద్ధి చేసింది. శివానీ వర్మ అనే మహిళ నేతృత్వంలోని ఈ స్టార్టప్‌ తీసుకొచ్చిన టూల్‌ను ‘దివ్య దృష్టి’ పేరుతో పిలుస్తున్నారు.

Published : 15 Jun 2024 06:12 IST

మహిళ ఆధ్వర్యంలోని స్టార్టప్‌ ఘనత

దిల్లీ: ఒకేసారి అత్యంత కచ్చితత్వంతో బహుముఖాలను గుర్తించగలిగేలా ఓ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) టూల్‌ని ఒక స్టార్టప్‌ సంస్థ అభివృద్ధి చేసింది. శివానీ వర్మ అనే మహిళ నేతృత్వంలోని ఈ స్టార్టప్‌ తీసుకొచ్చిన టూల్‌ను ‘దివ్య దృష్టి’ పేరుతో పిలుస్తున్నారు. ముఖ కవలికలతోపాటు నడక విధానాన్ని కలగలిపి అభివృద్ధి చేసిన ఈ ఆవిష్కరణ.. బయోమెట్రిక్‌ విధానంలో మరింత కచ్చితత్వం తీసుకురానున్నట్లు రక్షణ శాఖ శుక్రవారం పేర్కొంది. ‘డేర్‌ టు డ్రీమ్‌ 2.0’ పేరిట దేశవ్యాప్తంగా డీఆర్‌డీఓ నిర్వహించే థీమ్‌ ఆధారిత పోటీల్లో ఈ టూల్‌ అవార్డు గెలుచుకోవడం విశేషం. బెంగళూరులోని డీఆర్‌డీఓ ఆధ్వర్యంలో నడిచే సెంటర్‌ ఫర్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రోబోటిక్స్‌(సీఏఐఆర్‌) ల్యాబ్‌ నుంచి సాంకేతిక సాయం తీసుకొని దీన్ని రూపొందించారు. ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’లో భాగంగా రక్షణ రంగంలోనూ స్టార్టప్‌లను ప్రోత్సహించే విధానానికి ‘దివ్య దృష్టి’ నాంది పలికిందని డీఆర్‌డీఓ కార్యదర్శి వి.కామత్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని