కేంద్ర మంత్రి సోమణ్ణ కుమారుడిపై కేసు

రైల్వేశాఖ సహాయ మంత్రి వి.సోమణ్ణ కుమారుడు అరుణ్, ఆయన సహచరుడు ప్రమోద్‌రావుపై బెంగళూరు సంజయనగర ఠాణాలో కేసు నమోదు చేసినట్లు సంబంధిత అధికారులు శుక్రవారం వెల్లడించారు.

Published : 15 Jun 2024 06:12 IST

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే: రైల్వేశాఖ సహాయ మంత్రి వి.సోమణ్ణ కుమారుడు అరుణ్, ఆయన సహచరుడు ప్రమోద్‌రావుపై బెంగళూరు సంజయనగర ఠాణాలో కేసు నమోదు చేసినట్లు సంబంధిత అధికారులు శుక్రవారం వెల్లడించారు. మోసం చేయడంతోపాటు ప్రాణహాని తలపెడతామంటూ ఒక ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ వ్యవహారంలో తన భర్తను, తనను బెదిరించారని తృప్తి హెగ్డే ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకునేందుకు మొదట పోలీసులు నిరాకరించడంతో ఆమె 37వ ఏసీఎంఎం న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. చివరికి న్యాయమూర్తి ఆదేశాలతో వారిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..ఎట్టకేలకు దర్యాప్తు ప్రారంభించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని