యడియూరప్పకు కోర్టులో ఊరట

మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఓ బాలికను లైంగికంగా వేధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్పను అరెస్టు చేయవద్దని సదాశివనగర పోలీసులను ఆ రాష్ట్ర హైకోర్టు శుక్రవారం ఆదేశించింది.

Published : 15 Jun 2024 06:13 IST

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఓ బాలికను లైంగికంగా వేధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్పను అరెస్టు చేయవద్దని సదాశివనగర పోలీసులను ఆ రాష్ట్ర హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఈనెల 17న విచారణకు హాజరయ్యే సమయంలోనూ ముందస్తు నోటీసు లేకుండా ఆయనను అరెస్టు చేయవద్దని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అదే సమయంలో.. విచారణకు గైర్హాజరు కాకూడదని యడియూరప్పకు తాఖీదులు జారీ చేశారు. ఇటీవల జరిగిన విచారణకు యడియూరప్ప హాజరుకాకపోవడంతో బెంగళూరులోని ఒకటో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు న్యాయమూర్తి ఎన్‌ఎం రమేశ్‌ గురువారం నాన్‌బెయిలబుల్‌ అరెస్టు వారెంటు జారీ చేసిన విషయం తెలిసిందే. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ యడియూరప్ప హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తాను దిల్లీలో ఉన్నానని, వచ్చే సోమవారం విచారణకు హాజరవుతానని న్యాయవాది ద్వారా పోలీసులకు యడియూరప్ప సమాచారాన్ని అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు