అమెరికాలో వర్క్‌ పర్మిట్‌దారుల పిల్లలను ఆదుకోండి

అమెరికాకు వర్క్‌పర్మిట్‌పై వచ్చిన దంపతుల పిల్లల(డ్రీమర్ల)కు 21 ఏళ్లు నిండగానే వారివారి దేశాలకు తిప్పిపంపేయకుండా తక్షణం రక్షణ కల్పించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు 43 మంది శాసనకర్తలు విజ్ఞప్తి చేశారు.

Published : 15 Jun 2024 06:13 IST

వాషింగ్టన్‌: అమెరికాకు వర్క్‌పర్మిట్‌పై వచ్చిన దంపతుల పిల్లల(డ్రీమర్ల)కు 21 ఏళ్లు నిండగానే వారివారి దేశాలకు తిప్పిపంపేయకుండా తక్షణం రక్షణ కల్పించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు 43 మంది శాసనకర్తలు విజ్ఞప్తి చేశారు. సాధికారంగా డ్రీమర్లుగా గుర్తింపు పొందిన 2,50,000 మందిలో అత్యధికులు భారతీయులే. అమెరికాలో హెచ్‌ 1బి వీసా మీద పనిచేస్తున్న, అమెరికాలో శాశ్వత వీసా కోసం ఐ-140 అనుతులు పొందిన విదేశీయుల పిల్లలు బాల్యంలోనే తల్లిదండ్రుల వెంట అమెరికాకు వస్తారు. తల్లిదండ్రులు శాశ్వత పౌరసత్వమిచ్చే గ్రీన్‌ కార్డుల కోసం దశాబ్దాల తరబడి వేచి ఉండాల్సిన దుస్థితి ఉంది. ఈలోపు వారి పిల్లలకు 21 ఏళ్ల వయసు వచ్చేస్తుంది. వారిని తిప్పిపంపకుండా అమెరికాలోనే ఉంచడానికి 2023లో పాలక ప్రతిపక్షాలు పార్లమెంటు ఉభయసభల్లో బాలల చట్టాన్ని ప్రతిపాదించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని