పాక్‌ నుంచి డ్రోన్ల ద్వారా డ్రగ్స్‌ సరఫరా

పాకిస్థాన్‌ నుంచి భారత్‌లోని రాజస్థాన్‌లో ఉన్న అనూప్‌గఢ్‌ జిల్లాకు డ్రోన్ల ద్వారా సరఫరా చేస్తోన్న 12 కిలోల మాదక ద్రవ్యాలను సరిహద్దు భద్రతా బలగాలు పట్టుకున్నాయి. వీటి విలువ రూ.60కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.

Published : 16 Jun 2024 05:14 IST

రాజస్థాన్‌కు తరలిస్తుండగా పట్టివేత

జైపుర్‌: పాకిస్థాన్‌ నుంచి భారత్‌లోని రాజస్థాన్‌లో ఉన్న అనూప్‌గఢ్‌ జిల్లాకు డ్రోన్ల ద్వారా సరఫరా చేస్తోన్న 12 కిలోల మాదక ద్రవ్యాలను సరిహద్దు భద్రతా బలగాలు పట్టుకున్నాయి. వీటి విలువ రూ.60కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. మరోవైపు, గుజరాత్‌లోని కచ్, దేవభూమి ద్వారక జిల్లాల తీర ప్రాంతాల్లో గడిచిన కొద్ది రోజుల్లోనే 100కు పైగా మాదక ద్రవ్యాల పొట్లాలు కొట్టుకు వచ్చాయని పోలీసులు తెలిపారు. వాటిని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించామని పేర్కొన్నారు. జమ్మూ-కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో మాదకద్రవ్య-ఉగ్రవాద కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ముగ్గురు వ్యక్తులను అరెస్టుచేసి వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి, నిషిద్ధ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని