నీట్‌-యూజీ పరీక్ష రద్దు చేయాలి

నీజీ-యూజీ (2024) పరీక్షను రద్దు చేయాలని, పరీక్ష నిర్వహణలో చోటు చేసుకున్న అవకతవకలపై న్యాయస్థానం పర్యవేక్షణలో సీబీఐ లేదా ఇతర స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

Published : 16 Jun 2024 05:16 IST

సుప్రీంకోర్టులో పిటిషన్‌

దిల్లీ: నీజీ-యూజీ (2024) పరీక్షను రద్దు చేయాలని, పరీక్ష నిర్వహణలో చోటు చేసుకున్న అవకతవకలపై న్యాయస్థానం పర్యవేక్షణలో సీబీఐ లేదా ఇతర స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. నీట్‌ పరీక్ష రాసిన 20 మంది విద్యార్థులు ఈ పిటిషన్‌ వేశారు. ఇప్పటికే నీట్‌ పరీక్షలో అక్రమాలపై సుప్రీంకోర్టుతో పాటు.. వివిధ హైకోర్టుల్లో పలు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే.

మంత్రి నివాసం దగ్గర ఆందోళన.. 

కేంద్ర విద్యాశాఖ మంత్రి దర్మేంద్ర ప్రధాన్‌ నివాసంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులపై శనివారం పోలీసులు సెక్షన్‌ 188 కింద కేసులు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం.. నాలుగు కార్లలో ఆందోళనకారులు మంత్రి నివాసానికి చేరుకున్నారు. వారి దగ్గర నేషనల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఎస్‌యూఐ) కరపత్రాలు ఉన్నాయి. వారు మంత్రి నివాసంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని