వందేభారత్‌ స్లీపర్‌ ప్రయోగాత్మక పరుగు పంద్రాగస్టుకు

రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల కంటే మెరుగ్గా ఉండే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ స్లీపర్‌ రైళ్ల ప్రయోగాత్మక పరుగును ఆగస్టు 15 నాటికి నిర్వహించనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.

Published : 16 Jun 2024 05:17 IST

దిల్లీ: రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల కంటే మెరుగ్గా ఉండే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ స్లీపర్‌ రైళ్ల ప్రయోగాత్మక పరుగును ఆగస్టు 15 నాటికి నిర్వహించనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు కూర్చొని ప్రయాణించేందుకు వీలుండే ఈ సెమీ హైస్పీడ్‌ రైళ్లలో ఇక నుంచి స్లీపర్ల ఏర్పాటుతో మెరుగైన సేవలు లభించనున్నాయి. ఇతర రైళ్లతో పోలిస్తే ఈ ప్రీమియం రైళ్లలో మెరుగైన సౌకర్యాలు అందనున్నాయి. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఛైర్‌కార్‌ రైళ్లు దేశవ్యాప్తంగా వివిధ నగరాల మధ్య తిరుగుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని