సమాజసేవ కోసం పెళ్లి మానుకొని.. అనాథ శవాలకు అంత్యక్రియలు

హరియాణాలోని ఫరీదాబాద్‌ జిల్లాకు చెందిన సతీశ్‌ చోప్రా (47) సాటి మనుషులకు సాయం చేయడం కోసం తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేశారు.

Published : 16 Jun 2024 06:27 IST

హరియాణాలోని ఫరీదాబాద్‌ జిల్లాకు చెందిన సతీశ్‌ చోప్రా (47) సాటి మనుషులకు సాయం చేయడం కోసం తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేశారు. ఈ సంకల్పానికి అడ్డుగా ఉంటుందని పెళ్లి కూడా మానుకొని, అంబులెన్సు సాయంతో పేదలకు వైద్యసేవలను ఆయన అందిస్తున్నారు. నిరుపేద, అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఎవరికి ఏ సాయం కావాలన్నా 24 గంటలూ సిద్ధంగా ఉండే సతీశ్‌ చోప్రా.. వైద్యం అవసరమైనవారిని స్వయంగా ఆస్పత్రికి తీసుకువెళతాారు. ఇందుకోసం తనే ఓ అంబులెన్సు కొన్నారు. మురికివాడల్లో నివసించే పిల్లలకు పుస్తకాలు, చెప్పులు, దుస్తులు పంపిణీ చేస్తుంటారు. ‘‘ఆర్థిక ఇబ్బందులు రాకూడదని స్నేహితులతో కలిసి ఒక బృందాన్ని ఏర్పాటుచేశా. గతంలో ఎక్కడైనా పెళ్లి వేడుకల్లో మిగిలిపోయిన భోజనం ఉందని తెలిస్తే.. నేనే అక్కడికి వెళ్లి దాన్ని తీసుకువచ్చి పేదలకు పంచేేవాడిని. ఇప్పుడు ప్రజలే ఫోను చేసి చెబుతున్నారు’’ అని సతీశ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని