మణిపుర్‌ సీఎం నివాసం సమీపంలో అగ్నిప్రమాదం

మణిపుర్‌ ముఖ్యమంత్రి ఎన్‌.బీరేన్‌ సింగ్‌ అధికారిక నివాసం సమీపంలోని ఓ నివాస భవనంలో శనివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ భవనం ఓ దివంగత ఐఏఎస్‌ అధికారి కుటుంబానిది.

Updated : 16 Jun 2024 06:10 IST

ఇంఫాల్‌: మణిపుర్‌ ముఖ్యమంత్రి ఎన్‌.బీరేన్‌ సింగ్‌ అధికారిక నివాసం సమీపంలోని ఓ నివాస భవనంలో శనివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ భవనం ఓ దివంగత ఐఏఎస్‌ అధికారి కుటుంబానిది. గత ఏడాది మణిపుర్‌లో అల్లర్లు చెలరేగినప్పటి నుంచి దీనిలో ఎవరూ నివాసం ఉండట్లేదు. మంటలు చెలరేగిన సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక దళం రంగంలో దిగి గంటలో పరిస్థితిని అదుపులోకి తెచ్చింది. సీఎం బంగ్లాకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ఈ ఘటన తర్వాత అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని