కళ్లలో కారం కొట్టి కర్రలతో ప్రొఫెసర్‌పై దాడి

తప్పుడు పనులు చేయొద్దని వారించినందుకు కక్ష పెంచుకున్న కొందరు విద్యార్థులు తమ ప్రొఫెసర్‌పై దాడికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో చోటుచేసుకుంది. ఇక్కడి ప్రభుత్వ జె.హెచ్‌. పీజీ కళాశాలలోకి శుక్రవారం సాయంత్రం ఏడుగురు విద్యార్థులు వచ్చారు.

Published : 16 Jun 2024 05:53 IST

భోపాల్‌: తప్పుడు పనులు చేయొద్దని వారించినందుకు కక్ష పెంచుకున్న కొందరు విద్యార్థులు తమ ప్రొఫెసర్‌పై దాడికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో చోటుచేసుకుంది. ఇక్కడి ప్రభుత్వ జె.హెచ్‌. పీజీ కళాశాలలోకి శుక్రవారం సాయంత్రం ఏడుగురు విద్యార్థులు వచ్చారు. ఓ తరగతి గదిలోకి ప్రవేశించి అక్కడ విద్యార్థులకు పాఠం చెబుతున్న సహాయ ఆచార్యుడు నీరజ్‌ ధాకడ్‌ కళ్లల్లో కారం జల్లి, కర్రలతో కొట్టారు. ఆయనకు తీవ్ర గాయాలైనట్లుగా వైద్యులు పేర్కొన్నారు. సీసీటీవీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇటీవల కళాశాల ఉపకారవేతనాల అవకతవకలపై ప్రొఫెసర్‌ నీరజ్‌కు, కళాశాల పూర్వ విద్యార్థి అన్నూ ఠాకుర్‌కు మధ్య వాగ్వాదం జరిగిందని కళాశాల యాజమాన్యం తెలిపింది. ప్రొఫెసర్‌ సంతకాన్ని, కాలేజీ స్టాంప్‌ను దుర్వినియోగం చేయడానికి ప్రయత్నించిన ఠాకుర్‌ను నీరజ్‌ వారించడం వారి మధ్య ఘర్షణకు దారితీసిందని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు