దిల్లీ నీటి సంక్షోభంపై కాంగ్రెస్‌ ‘మట్కా ఫోడ్‌’

దేశ రాజధాని నగరమైన దిల్లీలో నెలకొన్న నీటిసంక్షోభంపై కాంగ్రెస్‌ పార్టీ నగరవ్యాప్తంగా రోడ్లపై మట్టికుండలు పగలగొడుతూ (మట్కా ఫోడ్‌) ఆందోళనలు చేపట్టింది. శనివారం ఉదయం 10.00 గంటల నుంచి కాంగ్రెస్‌ కార్యకర్తలు నెత్తిన కుండలు పెట్టుకొని, పార్టీ జెండాలతో ప్రదర్శనలు జరిపారు.

Published : 16 Jun 2024 05:54 IST

దిల్లీ: దేశ రాజధాని నగరమైన దిల్లీలో నెలకొన్న నీటిసంక్షోభంపై కాంగ్రెస్‌ పార్టీ నగరవ్యాప్తంగా రోడ్లపై మట్టికుండలు పగలగొడుతూ (మట్కా ఫోడ్‌) ఆందోళనలు చేపట్టింది. శనివారం ఉదయం 10.00 గంటల నుంచి కాంగ్రెస్‌ కార్యకర్తలు నెత్తిన కుండలు పెట్టుకొని, పార్టీ జెండాలతో ప్రదర్శనలు జరిపారు. దిల్లీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నీటిసంక్షోభంపై చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ఈ నిరసనలో పాల్గొన్న దిల్లీ కాంగ్రెస్‌ చీఫ్‌ దేవేందర్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. కాగా, దిల్లీ నీటిసమస్యను పరిష్కరించాలని కోరుతూ ఆప్‌ ఎమ్మెల్యేలు కొందరు కేంద్ర జల్‌శక్తి మంత్రి సి.ఆర్‌.పాటిల్‌కు లేఖ రాశారు. యమునానది జలాలకు సంబంధించిన అంతర్రాష్ట్ర వివాదంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని దిల్లీ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దిలీప్‌ పాండే కోరారు. యమునానది అదనపు జలాలను మానవతా దృక్పథంతో దిల్లీకి సరఫరా చేయాలని ఆప్‌ సీనియర్‌ నాయకురాలు ఆతిశీ హరియాణా ప్రభుత్వాన్ని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని