చీనాబ్‌ వంతెనపై రైలింజను పరుగు

జమ్మూకశ్మీర్‌లోని ప్రపంచంలో అత్యంత ఎత్తయిన చీనాబ్‌ రైల్వే వంతెనపై ఆదివారం రైలింజను ట్రయల్‌రన్‌ను విజయవంతంగా నిర్వహించారు.

Published : 17 Jun 2024 05:37 IST

దిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని ప్రపంచంలో అత్యంత ఎత్తయిన చీనాబ్‌ రైల్వే వంతెనపై ఆదివారం రైలింజను ట్రయల్‌రన్‌ను విజయవంతంగా నిర్వహించారు. చీనాబ్‌ వంతెనను దాటడంతోపాటు సంగల్దాన్‌ నుంచి రియాసీ వరకు ఓ రైలు ఇంజిన్‌ను నడిపిన దృశ్యాలతో కూడిన వీడియోను కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ‘ఎక్స్‌’లో షేర్‌ చేశారు. చీనాబ్‌ నదిపై నిర్మించిన ఈ రైల్వేబ్రిడ్జి మీదుగా రాంబన్‌ నుంచి రియాసీకి అతి త్వరలో రైలు సర్వీసులు ప్రారంభం కానున్నట్లు రైల్వేశాఖ ఇప్పటికే ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని