జమ్మూకశ్మీర్‌లో భద్రతా పరిస్థితులపై అమిత్‌ షా సమీక్ష

జమ్మూకశ్మీర్‌లో వరుస ఉగ్రదాడులు కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో అక్కడి భద్రతా పరిస్థితులపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా దిల్లీలో ఆదివారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

Published : 17 Jun 2024 05:37 IST

దిల్లీ: జమ్మూకశ్మీర్‌లో వరుస ఉగ్రదాడులు కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో అక్కడి భద్రతా పరిస్థితులపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా దిల్లీలో ఆదివారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. జమ్మూలో ఉగ్ర ఘటనలను నివారించేందుకు.. కశ్మీర్‌ లోయ తరహాలో కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ నెల 29 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లనూ షా సమీక్షించారు. లక్షల సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజీత్‌ డోభాల్, జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా, సైన్యాధిపతి జనరల్‌ మనోజ్‌ పాండే, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా, సీఆర్‌పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ అనీశ్‌ దయాల్‌ సింగ్, బీఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ నితిన్‌ అగర్వాల్, జమ్మూకశ్మీర్‌ డీజీపీ ఆర్‌.ఆర్‌.స్వైన్‌ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మరోవైపు- అమర్‌నాథ్‌ యాత్రికులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల వరకు బీమా సదుపాయం కల్పించాలని అధికార వర్గాలు నిర్ణయించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని