దిల్లీ-భోపాల్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో కేంద్ర వ్యవసాయ మంత్రి చౌహాన్‌

నిరాడంబర నేతగా ప్రజల్లో గుర్తింపు పొందిన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ దిల్లీ నుంచి భోపాల్‌కు రైల్లో ప్రయాణించారు.

Published : 17 Jun 2024 05:43 IST

రైల్లో ప్రయాణికులతో శివరాజ్‌ సింగ్‌ సంభాషణ

దిల్లీ: నిరాడంబర నేతగా ప్రజల్లో గుర్తింపు పొందిన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ దిల్లీ నుంచి భోపాల్‌కు రైల్లో ప్రయాణించారు. తోటి ప్రయాణికులతో ముచ్చటించారు. సెల్ఫీలకు పోజులిస్తూ సందడి చేశారు. తన సతీమణితో కలిసి శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ ఎక్కిన కేంద్రమంత్రిని చూడగానే ప్రయాణికులు ఆత్మీయంగా వచ్చి పలకరించారు. తన రైలు ప్రయాణ అనుభవాలను, ఆ ఫొటోలను చౌహాన్‌ ‘ఎక్స్‌’ ఖాతాలో పంచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌ కృషితో భారతీయ రైల్వేలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. ఈ పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ నిరాడంబరతపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘకాలం మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో విదిశ నియోజకవర్గం నుంచి 8.2 లక్షల ఓట్ల మెజార్టీతో భారీ విజయం సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని