దిల్లీ నీటి సంక్షోభం.. పైపులైన్లకు పోలీసు పహారా!

దేశ రాజధాని దిల్లీ నీటి సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. యమునాకు ప్రవాహం తగ్గడంతో నగరానికి నీటి ఇబ్బందులు తప్పడం లేదు.

Published : 17 Jun 2024 05:44 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ నీటి సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. యమునాకు ప్రవాహం తగ్గడంతో నగరానికి నీటి ఇబ్బందులు తప్పడం లేదు. ఇదే సమయంలో నీటి సరఫరా వ్యవస్థను దుండగులు ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో దిల్లీ జల మంత్రిత్వశాఖ కీలక చర్యలకు ఉపక్రమించింది. నగరానికి వచ్చే ప్రధాన పైపులైన్లకు పహారా కాయాలని విజ్ఞప్తి చేస్తూ దిల్లీ పోలీస్‌ కమిషనర్‌ సంజయ్‌ అరోరాకు ఆప్‌ మంత్రి అతిశీ లేఖ రాశారు. ‘ప్రధాన పైపులైన్లలో అనేక చోట్ల బోల్టులను తొలగించడంతో లీకేజీలు ఏర్పడుతున్నట్లు గుర్తించాం. వీటి వెనుక ఏదో దురుద్దేశం ఉంది. నీటి పైపులను ధ్వంసంచేయకుండా రక్షించేందుకు 15 రోజులపాటు గస్తీ నిర్వహించాలి. ప్రతి నీటిబొట్టూ విలువైంది. దాని పంపిణీ వ్యవస్థను రక్షించుకోవాలి’ అని లేఖలో పేర్కొన్నారు. నగరానికి నీటిని సరఫరా చేసే ప్రధాన పైపులైన్ల వద్ద దిల్లీ జల్‌ బోర్డు ఇప్పటికే గస్తీ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని