కోటాలో జేఈఈ అభ్యర్థి ఆత్మహత్య

రాజస్థాన్‌లోని కోటాలో జేఈఈ మెయిన్స్‌కు సన్నద్ధమవుతోన్న 17 ఏళ్ల విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. బిహార్‌కు చెందిన ఆయుష్‌.. ఓ హాస్టల్‌లో నివాసముంటున్నాడు.

Published : 17 Jun 2024 05:45 IST

జైపుర్‌: రాజస్థాన్‌లోని కోటాలో జేఈఈ మెయిన్స్‌కు సన్నద్ధమవుతోన్న 17 ఏళ్ల విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. బిహార్‌కు చెందిన ఆయుష్‌.. ఓ హాస్టల్‌లో నివాసముంటున్నాడు. జేఈఈ శిక్షణ తీసుకుంటున్న అతడు.. శనివారం రాత్రి తర్వాత గది నుంచి బయటకు రాలేదు. హాస్టల్‌ యజమాని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గది తలుపులు బద్దలుకొట్టి చూడగా.. ఆయుష్‌ ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. ఈ ఏడాది కోటాలో నమోదైన విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య 11కు చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు