ప్రయాణికుడి ఆహారంలో ‘బ్లేడ్‌’ నిజమే.. అంగీకరించిన ఎయిర్‌ ఇండియా

తమ సంస్థకు చెందిన విమానంలో ప్రయాణికుడికి అందించిన ఆహారంలో బ్లేడ్‌ (లోహపు ముక్క) వచ్చినట్లు ఎయిర్‌ ఇండియా సోమవారం అంగీకరించింది. తమ క్యాటరింగ్‌ భాగస్వామికి చెందిన ఆహార తయారీ కేంద్రంలో కూరగాయలను తరిగే యంత్రం నుంచి అది ఊడిపడిందని ఓ ప్రకటనలో వివరించింది.

Published : 18 Jun 2024 04:46 IST

ముంబయి: తమ సంస్థకు చెందిన విమానంలో ప్రయాణికుడికి అందించిన ఆహారంలో బ్లేడ్‌ (లోహపు ముక్క) వచ్చినట్లు ఎయిర్‌ ఇండియా సోమవారం అంగీకరించింది. తమ క్యాటరింగ్‌ భాగస్వామికి చెందిన ఆహార తయారీ కేంద్రంలో కూరగాయలను తరిగే యంత్రం నుంచి అది ఊడిపడిందని ఓ ప్రకటనలో వివరించింది. బెంగళూరు నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు ప్రయాణించిన విమానంలో వారం రోజుల క్రితం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు వెల్లడించింది. తనకు అందించిన ఆహారంలో వచ్చిన బ్లేడ్‌లాంటి లోహపు ముక్క చిత్రాన్ని విమాన ప్రయాణికుడు, పాత్రికేయుడు మాథురెస్‌ పాల్‌ ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ఎయిర్‌ ఇండియాపై విమర్శలు గుప్పించారు. దీన్ని గమనించిన విమానయాన సంస్థ ఘటనపై దర్యాప్తు చేపట్టింది. బాధిత ప్రయాణికుడికి క్షమాపణలు చెప్పింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని