నేడు రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్‌ నిధులు

పీఎం కిసాన్‌ 17వ విడత నిధుల్ని మంగళవారం వారణాసి వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేయనున్నారు. ఈ పథకం ద్వారా మొత్తం 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.20వేల కోట్లు జమ కానున్నాయి.

Published : 18 Jun 2024 05:31 IST

ఈనాడు, దిల్లీ: పీఎం కిసాన్‌ 17వ విడత నిధుల్ని మంగళవారం వారణాసి వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేయనున్నారు. ఈ పథకం ద్వారా మొత్తం 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.20వేల కోట్లు జమ కానున్నాయి. అలాగే పారా ఎక్స్‌టెన్షన్‌ వర్కర్లుగా పని చేసేందుకు శిక్షణ పొందిన 30వేల మందికిపైగా స్వయం సహాయ బృందాల మహిళలకు సర్టిఫికెట్లను ప్రధాని మోదీ పంపిణీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా 732 కృషి విజ్ఞాన కేంద్రాలు, లక్షకుపైగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, 5 లక్షల ఉమ్మడి సేవా కేంద్రాలతోసహా 2.5 కోట్ల మంది రైతులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ తెలిపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని