రూ.5 లక్షలు పెట్టి టికెట్‌ కొన్నా సేవలు పేలవం

ఎయిరిండియా విమాన ప్రయాణంలో పీడకలలాంటి అనుభవం ఎదురైందని వినీత్‌ అనే ప్రయాణికుడు నెట్టింట అసహనం వ్యక్తం చేశారు. దిల్లీ నుంచి న్యూజెర్సీ వెళ్లిరావడానికి రూ.5 లక్షలు పెట్టి బిజినెస్‌ క్లాస్‌ టికెట్‌ కొన్నా..సంస్థ అందించిన సేవలు దారుణంగా ఉన్నాయని విమర్శించారు.

Published : 18 Jun 2024 03:56 IST

దిల్లీ: ఎయిరిండియా విమాన ప్రయాణంలో పీడకలలాంటి అనుభవం ఎదురైందని వినీత్‌ అనే ప్రయాణికుడు నెట్టింట అసహనం వ్యక్తం చేశారు. దిల్లీ నుంచి న్యూజెర్సీ వెళ్లిరావడానికి రూ.5 లక్షలు పెట్టి బిజినెస్‌ క్లాస్‌ టికెట్‌ కొన్నా..సంస్థ అందించిన సేవలు దారుణంగా ఉన్నాయని విమర్శించారు. ‘‘ఇటీవలి ఎయిర్‌ ఇండియా విమానంలో ప్రయాణం పీడకలలాంటి అనుభవాన్ని మిగిల్చింది. టేకాఫ్‌ తర్వాత నిద్రపోదామని చూస్తే..సీటు వంగలేదు. తర్వాత అడిగి, మరో సీటు మార్పించుకున్నాను. నిద్రలేచాక తిందామని చూస్తే.. వారు వడ్డించిన ఆహారం సరిగా ఉడకలేదు. పండ్లు తాజాగా లేవు. అంతా వాటిని తిరిగి ఇచ్చేశారు. టీవీ స్క్రీన్లు పనిచేయలేదు. చివరకు నా లగేజీ కూడా దెబ్బతింది’’ అంటూ వినీత్‌ సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఆ చిత్రాలను షేర్‌ చేశారు. ప్రయాణికుడికి కలిగిన అసౌకర్యంపై ఎయిర్‌ ఇండియా విచారం వ్యక్తం చేసింది. తమ సమావేశాల్లో దీనిపై చర్చిస్తామని, టికెట్‌ బుకింగ్, సీటు వివరాలు షేర్‌ చేయాలని వినీత్‌ను కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని