రైలు పట్టాలపై 10 సింహాలు.. బ్రేకులు వేసి వాటిని రక్షించిన రైలు డ్రైవర్‌

రైలు వేగంగా వెళ్తోన్న సమయంలో పట్టాలపైకి ఒకేసారి పది సింహాలు వచ్చిన ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. దీంతో అప్రమత్తమైన లోకోపైలట్‌.. తక్షణమే ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు.

Published : 18 Jun 2024 03:56 IST

భావ్‌నగర్‌(గుజరాత్‌): రైలు వేగంగా వెళ్తోన్న సమయంలో పట్టాలపైకి ఒకేసారి పది సింహాలు వచ్చిన ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. దీంతో అప్రమత్తమైన లోకోపైలట్‌.. తక్షణమే ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు. దాంతో వాటికి ప్రాణాపాయం తప్పింది. రైలు డ్రైవర్‌ సమయస్ఫూర్తికి అధికారుల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. గుజరాత్‌లోని పిపావావ్‌ పోర్టు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ‘‘గుజరాత్‌లోని పిపావావ్‌ పోర్టు స్టేషన్‌ నుంచి గూడ్స్‌ రైలు వెళ్తోంది. ఆ క్రమంలో ట్రాక్‌పై 10 సింహాలు సేదతీరుతున్నట్లు లోకో పైలట్‌ ముకేశ్‌ కుమార్‌ మీనా గుర్తించారు. వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు. అవి  దూరంగా వెళ్లే వరకు అతడు వేచిచూశారు. అనంతరం రైలు బయలుదేరింది. మీనా చేసిన పనికి అధికారుల నుంచి ప్రశంసలు లభించాయి’ అని వెస్టర్న్‌ రైల్వే భావ్‌నగర్‌ డివిజన్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఉత్తర గుజరాత్‌- పిపావావ్‌ పోర్టు మార్గంలో రైల్వే లైనులో కొన్నేళ్లుగా అనేక సింహాలు మరణిస్తున్నాయి. గిర్‌ అభయారణ్యానికి ఈ ప్రాంతం చాలా దూరంలోనే ఉన్నప్పటికీ ఇక్కడ సింహాలు తరచూ సంచరిస్తుంటాయి. దీంతో ట్రాక్‌ మార్గంలో అటవీశాఖ కంచెలను కూడా ఏర్పాటు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు