దిల్లీలో రెండు గంటలు నిలిచిన ఇండిగో విమానం

అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఇండిగో విమాన ప్రయాణానికి తీవ్ర ఆటంకం ఏర్పడిన ఘటన దిల్లీ విమానాశ్రయంలో సోమవారం చోటు చేసుకుంది. విమానం 6ఈ 2521 దిల్లీ నుంచి బెంగాల్‌లోని బాగ్‌డోగ్రా బయలుదేరేందుకు సిద్ధమైంది.

Updated : 18 Jun 2024 05:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఇండిగో విమాన ప్రయాణానికి తీవ్ర ఆటంకం ఏర్పడిన ఘటన దిల్లీ విమానాశ్రయంలో సోమవారం చోటు చేసుకుంది. విమానం 6ఈ 2521 దిల్లీ నుంచి బెంగాల్‌లోని బాగ్‌డోగ్రా బయలుదేరేందుకు సిద్ధమైంది. మధ్యాహ్నం 2.30కు టేకాఫ్‌ కావాల్సిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తి టేకాఫ్‌కు రెండు గంటలు ఆలస్యమైంది. అప్పటికే ప్రయాణికులు విమానంలో కూర్చున్నారు. ఏసీ పనిచేయకపోవడంతో కొందరు ప్రయాణికులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన ఇండిగో ‘‘ప్రయాణికుల భద్రతకు ఇండిగో ప్రాధాన్యమిస్తుంది. అసౌకర్యానికి చింతిస్తున్నాం. ఈ ఘటనపై చర్యలు తీసుకుంటున్నాం’’ అని ఓ ప్రకటనలో పేర్కొంది. 


దిల్లీ విమానాశ్రయంలో బోర్డింగ్, చెక్‌-ఇన్‌లో ఇబ్బందులు

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం మధ్యాహ్నం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీని వల్ల బోర్డింగ్, చెక్‌-ఇన్‌ ప్రక్రియలకు ఇబ్బందులు కలగడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మండోలాలోని పవర్‌ గ్రిడ్‌లో అగ్నిప్రమాదం జరగడంతో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలిగినట్టు తెలుస్తోంది. నగరానికి ఈ గ్రిడ్‌ నుంచి 1500 మెగావాట్ల విద్యుత్‌ సరఫరా అవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని