ఐఐటీ ఖరగ్‌పుర్‌లో విద్యార్థిని ఆత్మహత్య

ఐఐటీ ఖరగ్‌పుర్‌లో విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపుతోంది. బయోటెక్నాలజీ మూడో ఏడాది చదువుతున్న దేవికా పిళ్లై (21) తన హాస్టల్‌ గదిలో ఉరేసుకుని చనిపోయినట్లు పోలీసులు సోమవారం వెల్లడించారు.

Published : 18 Jun 2024 04:30 IST

కోల్‌కతా: ఐఐటీ ఖరగ్‌పుర్‌లో విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపుతోంది. బయోటెక్నాలజీ మూడో ఏడాది చదువుతున్న దేవికా పిళ్లై (21) తన హాస్టల్‌ గదిలో ఉరేసుకుని చనిపోయినట్లు పోలీసులు సోమవారం వెల్లడించారు. ఇది ఆత్మహత్యా లేక ఏమైనా కుట్ర దాగుందా అనే కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. సరోజినీనాయుడు హాల్‌కు జనరల్‌ సెక్రటరీగానూ ఉన్న దేవిక ఎంతో తెలివైన విద్యార్థి అని ఐఐటీ ఖరగ్‌పుర్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. బయోటెక్నాలజీ రంగంలో ధ్రువతారగా వెలుగుతుందని భావించామని, ఆమె మృతి తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని